Breaking News

కరోనా కష్ట కాలం...


 ఈ సంవత్సరం ఇప్పటివరకూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో 9 కోట్ల మందికి పైగా చేరారంటే నమ్మగలరా? ఇంకా ఆశ్చర్యమేంటంటే... ఈ చట్టం వచ్చాక ఏ సంవత్సరంలోనూ ఇంత మంది చేరలేదు. దీనంతటికీ కారణం కరోనా వైరస్సే. ఈ వైరస్ ఇండియాలో ప్రవేశించగానే... లాక్‌డౌన్ ప్రకటనలతో... పరిశ్రమలు, షాపులు, థియేటర్లు, పార్కులు, స్కూళ్లు, ప్రైవేట్ ఆఫీసులు ఇలా అన్నీ మూతపడ్డాయి. దాంతో కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. పొట్టకూటి కోసం ఏదో ఒక పనిచెయ్యాలని చాలా మంది ఉపాధి హామీ పథకంలో చేరిపోయారు. అలా ఈ సంవత్సరం 9 కోట్ల మందికి పైగా చేరడం ఓ రికార్డు అనుకోవచ్చు. 2005లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. గ్రామాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పథకంలో ఇంత ఎక్కువ మంది చేరడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వానికి RTI చట్టం ద్వారా పెట్టుకున్న అభ్యర్థనతో ఈ విషయం తెలిసింది.

మహాత్మాగాంధీ నరేగా చట్టాన్ని కాంగ్రెస్ సారధ్యంలోని UPA ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పేదవాళ్లకు ఇది సజీవ కట్టడం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని మెచ్చుకున్నారు. నిజంగానే కరోనా సమయంలో... ఈ పథకమే దేశ గ్రామీణ ప్రజలను కాపాడినట్లు తాజా లెక్కలను బట్టీ అర్థమవుతోంది. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిరుద్యోగం బాగా పెరిగింది. ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులు సైతం... ఉపాధి హామీ పథకంలో చేరి పనులు చేసిన సందర్భాలు కనిపించాయి.

RTI ద్వారా వచ్చిన రిప్లై ఆధారంగా... ఈ సంవత్సరం 9 కోట్ల మందికి పైగా నరేగాలో చేరగా... 2019లో 8 కోట్ల మంది దాకా ఇందులో చేరినట్లు తెలిసింది. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తేజ్‌పాల్ ఈ అభ్యర్థన పెట్టారు. 2013 నుంచి ఈ స్కీమ్‌లో ఎంత మంది చేరారో చెప్పాలని కోరారు. అందుకు సంబంధించి ఓ టేబుల్ ద్వారా సమాచారం లభించింది.