Breaking News

నాగబాబు ఎమోషనల్..


 

నిహారిక కొణిదెల.. తండ్రి బాటలో నడిచి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. 'ఒక మనసు' 'హ్యాపీ వెడ్డింగ్','సూర్యకాంతం'. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం భాగానే అలరించాయి. అది అలా ఉంటే నిహారిక పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. పెళ్లికి ఇక రెండు రోజులే ఉండడంతో అన్ని హంగులు పూర్తయ్యాయి. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. దీంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌కు చేరుకొని పెళ్లి పనులు మొదలుపెట్టారు. మొన్న శనివారం రోజున కార్తీక బహుళ పంచమి శుభ దినం కాబట్టి..

నిహారికను పెళ్లి కూతురుని చేసిని సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముందుగా సాంప్రదాయం ప్రకారం మంగళ స్నానాలు చేయించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వా త పెళ్లి కూతురిని చేసారు. ఈ సందర్భంగా ఆమె ముప్పై సంవత్సరాల క్రితం తన తల్లి కట్టుకున్న చీరనే నిహారిక మరోసారి ధరించింది. దీనికి సంబందించిన ఓ ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది. పెళ్లి కూతురు అయ్యినా సందర్భంగా నిహారిక తన పెదనాన్న చిరంజీవి ఆశీర్వాదం తీసుకుంది. అంతేకాదు ఓ సెల్ఫీని కూడా తీసింది. ఆ ఫోటోల్లో నిహారిక, చిరంజీవి మెరిసిపోతున్నారు. అయితే దీనికి సంబందించిన ఓ ఫోటోను నిహారిక తండ్రి నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్'స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా నాగబాబు చిరంజీవని ఉద్దేశిస్తూ.. ఆయన ప్రేమకు ఎటువంటి సరిహద్దులు ఉండవు.. అతని చిరునవ్వు ప్రతి సంఘటనను ఒక వేడుకగా మారుస్తుంది అంటూ ఎమోషన్ అవుతూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్'గామారింది.



ఇక నిహారిక పెళ్లికి రెండు రోజులే ఉండడంతో ఇప్పటికే అందరూ ఉదయపూర్ ప్యాలెస్‌కు చేరుకొగా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈరోజు వెళ్లనున్నారని తెలుస్తోంది. నాగబాబు కూతురు నిహారిక మ్యారేజ్ గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరుగనుంది. ఈ పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. ఇక అక్కడికి రాలేనివారికి, ఇతర బంధుమిత్రులకు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్‌ను ఇవ్వనుంది కొణిదెల కుటుంబం. ఇక నిహారిక పెళ్లి చేసుకునే వెంకట చైతన్య జొన్నలగడ్డ టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్నాడు. నిహారిక కొణిదెల విషయానికి వస్తే ఆమె నటిగా అందరికీ పరిచయమే. నిహారిక నటించిన వెబ్ సిరీస్‌ల్లో ముఖ్యంగా ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇక ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. నాగశౌర్యతో కలిసి ఒక మనసు, రాహుల్ విజయ్‌తో సూర్యకాంతం, విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌తో కలిసి ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రన్ వంటి తమిళ సినిమాల్లో నటించింది.