Breaking News

ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసిన రిజర్వ్ బ్యాంక్...


 మహారాష్ట్రలోని కారద్ జనతా సహకారీ బ్యాంక్ లిమిటెడ్ (Karad Janata Sahakari Bank Ltd) లైసెన్సును రద్దు చేసింది రిజర్వ్‌ బ్యాంక్ (RBI). ఈ బ్యాంకులో మూలధనానికి సరిపడా నిధులులేవనీ... ఆదాయం కూడా అంతగా లేదని తేల్చింది. మరి ఈ బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారి పరిస్థితి ఏంటి అని మనకు అనిపించవచ్చు. ఇందులో డబ్బులు దాచుకున్న 99 శాతం మందికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC)... ఆ డబ్బును తిరిగి చెల్లిస్తుందని ఆర్బీఐ తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఎప్పుడైతే లైసెన్స్ రద్దైంతే... నెక్ట్స్ మినిట్ నుంచే... లిక్విడేషన్ ప్రక్రియ మొదలైంది. అంటే ఏం లేదు... బ్యాంకుకు ఉన్న ఆస్తులు అమ్మేసి...

ఆ డబ్బును ఖాతాదార్లకు చెల్లిస్తారు. అలాగే... ఆల్రెడీ ఉన్న డబ్బును ముందుగా చెల్లిస్తారు. ఈ చెల్లింపులకు వడ్డీలు, ఇతరత్రా అన్నీ లెక్కలు కడతారు. ఇదంతా లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. కానీ... ఇదేమంత మనం చెప్పుకున్నంత తేలిగ్గా జరగదు. ఇందుకు కనీసం ఓ సంవత్సరం టైమైనా పడుతుంది.



లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా... DICGC... ఒక్కో ఖాతాదారుకూ... మాగ్జిమం రూ.5 లక్షల దాకా చెల్లిస్తుంది. మిగతా డబ్బును మెల్లిగా చెల్లిస్తారు. డిసెంబర్ 7న బ్యాంక్ లైసెన్స్ రద్దైంది. అంతే... మర్నాడు బ్యాంక్ తెరిచారుగానీ... బిజినెస్ జరపలేదు. అంటే... డిపాజిట్లు స్వీకరించడం, డిపాజిట్లను తిరిగి చెల్లించడం వంటివి ఏవీ జరపలేదు. ఇక జరపరు కూడా. అన్నీ DICGC చూసుకుంటుంది.

2017 నవంబర్ 7 నుంచి ఈ బ్యాంక్ పనితీరుపై పడిపోతూ ఉంది. అప్పట్లోనే దీన్ని మూసేసి లెక్క తేల్చేయాలనీ, లిక్విడేటర్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. మూడేళ్ల తర్వాత అవి అమలయ్యాయి. ఏ బ్యాంక్ అయినా 1949 బ్యాంకంగ్ రెగ్యులేషన్ చట్టంలోని రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. లేదంటే రిజర్వ్ బ్యాంక్ దాని లైసెన్సును రద్దు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్... తన ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించే పరిస్థితుల్లో లేదని తెలిసింది. అంటే దివాళా తీసినట్లు లెక్క. అందుకో కస్టమర్లు లబోదిబో మంటున్నారు. తమ డబ్బు తమకు వస్తుందో లేదో అనే టెన్షన్ వారిది. జీవితాంతం కష్టపడి కూడేసి... ఇలాంటి బ్యాంకుల్లో దాచుకుంటే... వడ్డీరేట్లు ఏటా తగ్గించేస్తూ... ఇలాంటి బ్యాంకులు... చివరకు ఇలా చేతులెత్తేస్తున్నాయి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంచుకోవట్లేదు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లను అనుసరిస్తున్నారు. ఈ బ్యాంక్ ఇకపై పనిచేస్తే... బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుందన్న RBI అందుకే లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది.