Breaking News

అమెరికా సైనికాధికారులపై వేటు


 టెక్సస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో హత్య, లైంగిక దాడి, వేధింపులు వంటి హింసాత్మక చర్యల కారణంగా.. 14 మంది కమాండర్లు, కింది స్థాయి సైనికాధికారులను అమెరికా సైన్యం విధుల నుంచి తొలగించింది.

ఈ ఏడాది వెనెసా గిలెన్ అనే సైనికురాలి హత్య నేపథ్యంలో ఫోర్ట్ హుడ్ స్థావరంలోని సమస్యలపై దర్యాప్తు ప్రారంభించారు.

నాయకత్వ వైఫల్యాల కారణంగానే ఇక్కడ సమస్యలు తలెత్తాయని సైనిక మంత్రి రియాన్ మెక్‌కార్తీ పేర్కొన్నారు.

అదృశ్యమైన సైనికుల వ్యవహారంపై కొత్త విధానాన్ని అమలు చేయాలని కూడా సైన్యం ఆదేశించింది.

మంగళవారం ఉద్యోగాల్లోంచి తొలగించిన సైనికాధికారుల్లో మేజర్ జనరళ్లు స్కాట్ ఎఫ్లాండ్, జెఫ్రీ బ్రాడ్‌వాటర్‌లు కూడా ఉన్నారు.

వెనెసా హత్యోదంతం ''మన అంతఃచేతనను దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఫోర్ట్ హుడ్‌లోను, అమెరికా సైన్యంలోను లోతుగా పాతుకుపోయిన సమస్యలను ముందుకు తెచ్చింది'' అని మెక్‌కార్తీ వ్యాఖ్యానించారు.