Breaking News

ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా?


 ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? దీంతో వెంటనే గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సిలిండర్ బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసే వారు దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం అమెజాన్‌లోకి వెళ్లాలి. అక్కడ పే బిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మీ గ్యాస్ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి. తర్వాత ఎల్‌పీజీ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు అమెజాన పే ద్వారా బిల్లు చెల్లించాలి.

ఇప్పుడు మీకు రూ.50 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అయితే తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎంలో కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే..

రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. దీని కోసం మీరు పేటీఎంకు వెల్లి గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి. రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్‌ఎల్‌పీజీ అనే ప్రోమోకోడ్ వాడాలి. అప్పుడు మీకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇది కూడా పేటీఎంలో తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికే వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు ఆఫర్ ఉంటుంది.