ప్రయోగం విజయవంతం!
ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ ఆర్మీ విజయవంతంగా చేపట్టింది. మంగళవారం నాడు అండమాన్ నికోబార్ ద్వీపంలో చేపట్టిన ప్రయోగంలో బ్రహ్మోస్ మిసైల్ మరో ద్వీపంపై ఉన్న ఉపపరితల లక్ష్యాన్ని అనుకున్న రీతిలో ఛేదించగలిగింది. ఈ క్రమంలో మిస్సైల్ సామర్థ్యంలో 400 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించగలిగే స్థాయికి చేరుకుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
భూమి, సముద్రం, గాలిలో నుంచి ప్రయోగించేందుకు వీలైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ అన్న విషయం తెలిసిందే. భారత్ రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ, రష్యా భాగస్వామ్యంలో ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. బ్రహ్మోస్‌కు సంబంధించి ఇప్పటికే భారత్ ఆర్మీ, నేవీ విభాగాల్లో కొన్ని రెజిమెంట్లు అందుబాటులో ఉన్నాయి.
