ఈ ముద్దుగుమ్మ మానసిక సమస్యతో బాధపడుతోందట.
నేల టిక్కెట్ సినిమాలో రవితేజాకు హీరోయిన్గా చేసిన మాళవికా శర్మ ఆ సినిమాతోనే టాలీవుడ్లో మంచి పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది. అంతేకాకుండా రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రెడ్లో కూడా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పూర్తకాకముందే ఈ అందాల రాసికి మరో రెండు ఆఫర్లు క్యూలో ఉన్నాయి. వచ్చే వేసవిలోపు మరో రెండు తెలుగు సినిమాల్లో మాళవికా చేయనుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాళవికా ఇటీవల ఫాన్స్కు గుండె పగిలే నిజాన్ని ఎంతో సింపుల్గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె మానసిక రుగ్మత గురించి అభిమానులకు తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్యర్యపోయారు. ఈ ముద్దుగుమ్మ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట.
