హల్దీ వేడుకలో ఫొగట్ సిస్టర్స్
భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా - సంగీత ఫొగట్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నవంబరు 25న మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకలతో కాబోయే వధూవరుల ఇళ్లలో సందడి నెలకొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో హల్దీ, మెహందీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సంగీత ఫొగట్తో పాటు, ఆమె సోదరీమణులు, రెజర్లు గీత ఫొగట్, బబితా ఫొగట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
