Breaking News

ఇండియాలో 500 Mbps వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే...


 ఇండియాలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ బారీగా పెరిగింది. ఒకే వై-ఫై నెట్‌వర్క్‌ మీద ఆధారపడి చాలా మంది వ్యక్తులు వారి ఇంటి వద్ద నుండే ఆఫీస్ కార్యకలాపాలు చేస్తున్నారు, మరియు పిల్లలు ఆన్ లైన్ తరగతులు వింటున్నారు. అలాగే దీనికి తోడుగా వినోదం కోసం ప్రజలు సినిమాలను మరియు టీవీ షోలను ప్రసారం చేయడానికి కూడా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. ఒకవేళ మీకు పెద్ద కుటుంబం ఉంటే కనుక మీరు పొందడానికి ఉత్తమమైన ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్‌లలో ఒకటి 500 ఎమ్‌బిపిఎస్ ప్లాన్. ఈ ఒక్క ప్లాన్‌లతో ఒకే వై-ఫై నెట్‌వర్క్‌తో ఎక్కువ మందిని అనుసంధానించబడి భారీగా డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

భారతదేశంలో లభించే ఉత్తమమైన 500 Mbps ఇంటర్నెట్ ప్లాన్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


జియోఫైబర్ 500 Mbps స్పీడ్ రూ.2,499 ప్లాన్ వివరాలు

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు Rs.2,499 ధర వద్ద అందించే ప్లాన్‌తో వినియోగదారులకు 500 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ వార్షిక చెల్లుబాటుతో కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకున్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు జియో సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా అందించడంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 3.3TB లేదా 3,300GB నెలవారీ డేటా క్యాప్ ఉండడం గమనార్హం.