Breaking News

ర్యుగు ఆస్టరాయిడ్​ నుంచి సేకరించిన హయబుసా-2


 జపాన్ స్పేస్ క్రాఫ్ట్ హయబుసా-2 ఆస్టరాయిడ్ శాంపిళ్లను భూమిపైకి పంపింది. భూమికి 30కోట్ల కిలోమీటర్ల దూరంలోని ర్యుగు ఆస్టరాయిడ్​పై మట్టిని, మెటీరియల్​ను కలెక్ట్​ చేసిన హయబుసా-2. ఆ శాంపిళ్లతో కూడిన క్యాప్సూల్​ను భూమిపైకి జారవిడిచింది.

2010లో హయబుసా-1 ప్రాజెక్టును చేపట్టి ఇటోకవా ఆస్టరాయిడ్ నమూనాలను భూమికి తీసుకొచ్చింది.

సోలార్ సిస్టమ్ గుట్టు తెలుస్తది.

సోలార్ సిస్టమ్ గుట్టును తెలుసుకునేందుకు ఈ శాంపిళ్లు ఎంతగానో ఉపయోగపడతా యని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని పరిశోధిస్తే నీరు, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. హయబుసా-2 స్పేస్ క్రాఫ్ట్ మరో రెండు ఆస్టరాయిడ్స్ పైకి వెళ్లనుంది. అది 2026 వరకు 2001 సీసీ21, 2031 వరకు 1998 కేవై26 అనే ఆస్టరాయిడ్స్ ను చేరుకోనుంది.