ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం...
ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం... డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఝలక్ ఇచ్చింది.. ఈ నిర్ణయం.. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈఎస్) ఉద్యోగులకు వర్తించనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 జూన్ 30 వరకు కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం కరోనావైరస్తో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో సీబీసీఈ ఉద్యోగుల డీఏ అదనపు ఇన్స్టాల్మెంట్లకు ఐడీఏ వేతన సవరణ గైడ్లైన్స్ వర్తిస్తాయి.. దీంతో.. అక్టోబర్ నెల నుంచి డీఏ అదనపు చెల్లింపులు ఉండవని.. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ స్పష్టం చేసింది.. 2021 జనవరి నుంచి మార్చి వరకు కూడా డీఏ అదనపు ఇన్స్టాల్మెంట్లు ఉండవని స్పష్టం చేసింది కేంద్రం.
