రాష్ట్ర గవర్నరును కలిసిన డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేటుపై మమతా సర్కారు బదిలీవేటు
పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నరును కలిసిన డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేటుపై మమతా సర్కారు బదిలీవేటు వేసింది. రాజ్భవన్లో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్తో సమావేశమైన కొద్ది గంటలకే డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ పొన్నంబలం బదిలీ అయ్యారు. 2012 బెంగాల్ కేడర్ అధికారి పొన్నంబలం ఈ ఏడాది ఏప్రిల్లో డార్జిలింగ్ డీఎంగా నియమితులయ్యారు. గవర్నర్ ధంకర్ ఆదివారం డార్జిలింగ్ కు రావడంతో రాజ్ భవన్ లో జిల్లా మెజిస్ట్రేట్ పొన్నంబలం, ఎస్పీ డాక్టర్ సంతోష్ నింబల్కర్, సిలిగురి పోలీసు కమిషనర్ త్రిపురారీలు సోమవారం కలిశారు. తనను కలిసిన అధికారులతో గవర్నరు ధంకర్ మాట్లాడుతూ అధికారులు రాజకీయంగా తటస్థంగా ఉండాలని కోరారు
.''డార్జిలింగ్ ఎస్పీ, జిల్లా మెజిస్ట్రేట్లు 2012 బ్యాచ్ అద్భుతమైన అధికారులు, రాజకీయ కార్యకర్తలుగా ఉండటం వారి పని కాదని నేను ఆ యువ అధికారులకు విజ్ఞప్తి చేశాను,వారు అగ్నితో ఆడటానికి వృత్తిలో చాలా చిన్నవారు.''అని గవర్నరు ధంకర్ చెప్పారు.
