నీళ్లతో మంటలు
సాధారణంగా ఎప్పుడైనా మంటలు అంటుకుంటే నీళ్లు పోసి ఆర్పడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నీళ్లతో మంటలు వస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కుళాయి తిప్పగానే ఒక వ్యక్తి నీళ్ల దగ్గర ఒక లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా నీటికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు స్థితికి చేరుకుంది. కాగా వీడియోను పీపుల్స్ డెయిలీ తన ట్విటర్లో షేర్ చేయడంతో చూసినవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. నీళ్లలో మంటలా ఇదెలా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు.
చైనాకు చెందిన వెన్ అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయని వెన్ తెలిపింది.
