జపాన్ నూతన ప్రధాని యోషిహిడే సుగో తొలి అంతర్జాతీయ పర్యాటన
జపాన్ నూతన ప్రధాని యోషిహిడే సుగో తొలి అంతర్జాతీయ పర్యాటన ఖరారైంది. ఈ నెల 18 నుంచి 21 వరకు ఆయన వియత్నం, ఇండొనేషియా దేశాల్లో పర్యటించనున్నట్లు ఆ దేశ చీఫ్ క్యాబినెట్ కార్యదర్శి కట్సూనోబు కటో శుక్రవారం తెలిపారు. మూడురోజులపాటు ఆయన ఈ ఇరుదేశాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ప్రధాని షింజో అబే సైతం తొలిసారి అధికారికంగా ఈ రెండు దేశాల్లోనే పర్యటించడం గమనార్హం. గతనెల జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగోను న్యాయ కోవిదులు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ప్రధానిగా ఉన్న షింజో అబే తీవ్ర అనారోగ్యం కారణంగా ఆగష్టు 28న తన పదవికి రాజీనామా చేశారు. వియత్నం, ఇండొనేషియాతో జపాన్‌కు మంచి సంబంధాలుండటంతో తొలి అధికార పర్యటనకు సుగో ఈ రెండు దేశాలనే ఎంపిక చేసుకున్నట్లు సమాచారంA
