వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్యాన్స్ లేకుండానే జరగనుందని నిర్వాహకులు వెల్లడి
\వచ్చే ఏడాది జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్యాన్స్ లేకుండానే జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు. శుక్రవారం ఓ ప్రకటనలో 2020 వింబుల్డన్ కరోనా వైరస్ కారణంగా రద్దు కాగా.. 2021 వింబుల్డన్‌ను మాత్రం ఫ్యాన్స్‌కు అనుమతివ్వకుండా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జరగాల్సిన వింబుల్డన్ టోర్నీ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం రద్దైన విషయం తెలిసిందే. కరోనా తీవ్రత కొంత తగ్గడంతో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రేక్షకులు లేకుండా జరగ్గా.. వాయిదాపడ్డ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మాత్రం కేవలం 1,000 మంది ప్రేక్షకుల అనుమతితో జరిగింది. ఈ క్రమంలో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఈ విషయాన్ని తెలియజేశారు. 134వ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ షెడ్యూల్ ప్రకారం 28 జులై 11, 2021నుంచి ప్రారంభం కానుంది.
