Breaking News

తెలంగాణలో తగ్గుతున్న కరోనా... స్వల్ప ఊరట



తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వాసులకు స్వల్ప ఊరట లభించింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 46,657 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,717 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదలచేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.222కి చేరింది.

కరోనా బారి నుంచినిన్న ఒక్క రోజే 2,103 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,85,128కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,713 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 21,209 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య35,47,051కి చేరింది. ఎప్పటిలాగే అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.


మరోవైపు తెలంగాణలో కరోనా రిస్క్ తక్కువేనని తేలింది. కోవిడ్‌-19 మృతుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే రాష్ట్రంలో దీర్ఘకాల వ్యాధులున్నవారి గృహాలు 6.12 శాతం.. జాతీయ సగటు 9.38 శాతంగా నమోదు అయ్యాయి. 33.19 శాతంతో దేశంలో అత్యధిక రిస్క్‌లో కేరళ ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, గోవా, పంజాబ్‌ ఉన్నాయి. ఇక రిస్క్‌ జాబితాలో కింది నుంచి 11వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లు ఐఐపీఎస్‌ చేసిన అధ్యయన నివేదికలో వెల్లడి అయ్యింది.