పగిలిన పెదవులు మృదువుగా మారాలంటే..
చలికాలంలో పెదవులు పొడిబారి అందవిహీనంగా మారతాయి. వాతావరణంలో అతి వేడి, అతి చల్లదనం ముఖంపై కొద ఆప్రభావం చూపుతాయి. అవే పెదవులు పగిలిపోవడానికి కారణాలు. కొన్ని సార్లు శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని చెప్పేందుకు పగిలిన పెదవులు సూచన. అందుకే వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
అయితే పగిలిన పెదవులు ముఖాన్ని అందవిహీనంగా మరుస్తాయి. మృతకణాలు పెదవులపై అలాగే ఉండిపోతే అది కూడా హాని కారకమే. కాబట్టి చలి కాలంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పగిలిన పెదవుల సమస్యను తగ్గించవచ్చు. పెదవులు పగిలితే వాటిని తిరిగి మృదువుగా మార్చేందుకు వీటిని ఉపయోగించవచ్చు.
టీస్పూన్ బీట్రూట్ రసంలో అర టీస్పూను చక్కెర, కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులపై రాయాలి.
