అట్లెట్ల పంపిస్తారు సార్..
ఆసీస్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో జడేజా స్థానంలో 'కన్కషన్ సబ్‌స్టిట్యూట్'గా చాహల్‌ను అనుమతించడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఈ విషయంపై మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ సమయంలో కోచ్ లాంగర్.. మ్యాచ్ రిఫరీ బూన్ ముందు వాదనకు దిగాడు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్. అతను రెగ్యులర్ బౌలర్ కాదు అలాంటప్పుడు చాహల్ లాంటి రెగ్యులర్ బౌలర్‌ను ఎలా సబ్‌స్టిట్యూట్'గా అనుమతిస్తారు అంటూ కోచ్ లాంగర్ అనుమానం వ్యక్తం చేశాడు. జడేజా స్థానంలో 'కన్కషన్ సబ్‌స్టిట్యూట్'గా చహల్‌ను అనుమతించడం సరైన విధానం కాదని మరికొందరు సీనియర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ జడేజా ఉన్నా కూడా నాలుగు ఓవర్లు వేసేవాడని అలాంటప్పుడు ఇది ఎలా తప్పు అవుతుందని మరికొందరి నుంచి సమర్థనీయమైన వాదన కూడా వినిపిస్తోంది.
జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో కండరాల నొప్పితో బాధపడ్డాడు. అలాగే 20 ఓవర్లో స్టార్క్ వేసిన బంతి జడేజా హెల్మెట్‌ను బలంగా తగిలింది. అది ఎంత స్ట్రాంగ్ హిట్ చేసిందంటే ఆ బంతి గాల్లోకి లేచి బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రిక్స్ సైతం వదిలేసేంతలా.. దీన్ని బట్టి చూస్తే దాని వేగం ఏమిటో అర్థమవుతుంది. ఇన్నింగ్స్ ముగిసిన జడేజా 'కన్కషన్'కు గురయ్యాడని తలకు బంతి బలంగా తాకడం వల్ల ఆ నోప్పి త్రీవంగా ఉన్నట్లు భారత వైద్య బృందం తేల్చింది. దీంతో రీఫరీకి సబ్‌స్టిట్యూట్ అవసరం ఉన్నట్లు తెలిపింది. చాహాల్.. జడేజా స్థానంలో జడేజా స్థానంలో 'కన్కషన్ సబ్‌స్టిట్యూట్'గా రావడం అతను మ్యాచ్‌ను మలుపు తిప్పడంతోనే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
గాయం కారణంగా రవీంద్ర జడేజా సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. జడేజా స్థానంలో కుడి చేతి వాటం పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో... ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇదే ఊపుతో... మిగతా 2 మ్యాచ్‌లను కూడా గెలిచి... సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా... జడేజాను కోల్పోవడం షాకింగే.
