ఢిల్లీకి చెందిన రోష్ని నాడార్ ఇటీవలే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. హురున్-కొటక్ వెల్త్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద రూ.54,850 కోట్లుగా ఉంది. రోష్ని తర్వాత బయోకాన్ ఫౌండర్, ఎండీ కిరణ్ మజుందర్‌షా రెండో స్థానంలో ఉన్నారు.రూ.36,600 కోట్ల సంపదతో రెండో అత్యంత ధనికురాలిగా కిరణ్ నిలిచారు. 1978లో కిరణ్ బయోకాన్‌ను ఏర్పాటు చేశారు. మూడో స్థానంలో డయాబెటిక్, కార్డియోవాస్క్యులర్ మెడిసిన్ల కంపెనీ యూఎస్‌వీకి చెందిన లీలా గాంధీ తివారి ఉన్నారు. ఈమె సంపద రూ.21,340 కోట్లుగా ఉంది. జోహో ఫౌండర్ శ్రీధర్ సిస్టర్ రాధా వేంబు కొటక్ వెల్త్ హురున్ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్నారు. ఆమె వెల్త్ రూ.11,590 కోట్లుగా ఉంటుందని రిపోర్ట్ అంచనావేసింది. ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాధా జోహోలో జాయిన్ అయ్యారు. ఈ లిస్ట్‌లో రిచెస్ట్ ప్రొఫెషనల్ మేనేజర్‌గా జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు. ఆమె నెట్‌వర్త్ రూ.10,220 కోట్లు. లండన్‌లో పుట్టి, ఢిల్లీలో పెరిగిన జయశ్రీ.. క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్వర్క్స్కు సీఈవోగా ఉన్నారు. జయశ్రీ అంతకుముందు సిస్కోలో పనిచేశారు. రమణ్ ముంజల్ భార్య రేణు ముంజల్‌కు కొటక్ హురున్ లిస్ట్‌లో ఏడో స్థానం దక్కింది. ఈమె సంపద రూ.8,690 కోట్లు. ప్రస్తుతం హీరో ఫిన్‌కార్ప్‌కు ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలెంబిక్ సీఈవో, ఎండీ అయిన మాలికా చిరాయు అమిన్ రూ.7,570 కోట్లతో ఎనిమిదో స్థానంలో, థెర్మాక్స్ అను అగా, మెహర్ పుదుంజీ రూ.5,850 కోట్లతో తొమ్మిదో స్థానంలో, నైకాకు చెందిన ఫాల్గుని నాయర్ అండ్ ఫ్యామిలీ రూ.5,410 కోట్లతో పదవ స్థానంలో ఉన్నారు.
టాప్ 5లో దివీస్ నీలిమా
Reviewed by AUTHOR..
on
December 03, 2020
Rating: 5