సేల్ఫి ప్రియులకు శుభవార్త..
మొబైల్ ప్రియులకు భారీ శుభవార్త.. ధర తక్కువ ఎక్కువ ఫీచర్లతో మరో మూడు కొత్త ఫోన్లు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి.. ఇప్పటివరకు ఆయ కంపెనీల నుంచి వచ్చిన ఫోన్ల కంటే ఇప్పుడు వస్తున్న ఫోన్లు సరికొత్త ఫీచర్లతో జనాలను ఆకట్టుకుంటాయని అంటున్నారు. అవేంటో .. వాటి ఫీచర్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం..
రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీ ..
రెడ్ మీ లో ఇప్పటివరకు చాలా ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి.. కానీ ఇప్పుడు వచ్చిన ఫోన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.. జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను భారతీయ మార్కెట్ లో రూ.17,900 నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,200 ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,400 ఉంది.
రెడ్ మీ నోట్ 9 5జీ ..
ఈ ఫోన్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది..వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,600 నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,800 ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,100 నిర్ణయించారు. ఈ ఫోన్ క్లౌండ్ ఇంక్ గ్రే, ఫ్లోయింగ్ షాడో పర్పుల్, అవుట్ సైడ్ ద క్యాసిల్ పీక్ రంగుల్లో అందుబాటులో ఉంది.ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు..బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
రెడ్ మీ నోట్ 94 జి..
ఈ ఫోన్ కూడా పైన వాటిలో లాగానే మూడు వేరియంట్లలో లభిస్తుంది..6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,200 ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,300 ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరన రూ.15,600 నిర్ణయించారు. స్మోక్ వేవ్ బ్లూ, మిస్టీ గ్రీన్, ఫెదర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ మూడు ఫోన్లకు సంబంధించిన సేల్ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది..
ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ ఉంది.. సేల్ఫీ ప్రియులకు ఈ ఫోన్లు బాగా యుజ్ అవుతాయి.
