రహదారిపై అర్ధరాత్రి తరువాత రోడ్డు ప్రమాదం
చలికాలం వచ్చింది అంటే ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు పడిపోతాయి. మంచు పెద్ద ఎత్తున కురుస్తుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించవు. జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ వద్ద ప్రయాగ్ రాజ్ - లక్నో జాతీయ రహదారిపై అర్ధరాత్రి తరువాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్ ను జీబు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వచ్చిన జీవు ఆగిఉన్న ట్రక్ ను ఢీకొట్టింది.
