బాలికను అధుకున్న సోనూసూద్
తాజాగా అనారోగ్యంతో బాదపడుతున్న ఓ బాలికను సోనూసూద్ ఆదుకున్నారు. తక్షణ సహాయం చేయడమే కాకుండా ఎంతవరకైనా తానే భరిస్తానని చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి ఆపరేషన్ ఖర్చు కూడా తానే పెడతానని చెప్పి సోనూసూద్ మరోసారి హీరో అయిపోయాడు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటకు చెందిన మారయ్య, సరస్వతి దంపతుల కూతురు తేజశ్రీ వయస్సు 12 సంవత్సరాలు. ఈమె చిన్నప్పటి నుంచీ గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంది. ఈమెకు నెలకు మందుల కోసం రూ. 20వేల దాకా ఖర్చు వస్తోంది. ప్రతి నెలా ఇంత మొత్తంలో ఖర్చు పెడుతూ వీళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే సోనూసూద్ మంచి మనసును తెలుసుకున్న వీళ్లు హైదరాబాద్‌లో షూటింగ్ కోసం వచ్చిన సోనూసూద్‌ను కలిశారు.
అంతేకాకుండా గుండె మార్పిడి చేయాల్సి వస్తే.. అందుకు అవసరమైన డబ్బులు కూడా తానే భరిస్తానని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సోనూసూద్ సహాయం చేసే మనసు చూసి పాప తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. సోనూసూద్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని అంతా అనుకుంటున్నారు.
