రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి ఆసీస్ మరోసారి బ్యాటింగ్ వైపే మొగ్గుచూపింది. మూడు వన్డే సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఆసీస్ భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. సిరీస్పై పట్టు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా నెగ్గాలి. మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో నిలిచింది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ధీమాతో ఉంది. ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది.
