కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క విడుదల చేశారు. వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఎంఎంటీఎస్, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్పోర్టు వరకూ పొడిగిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
