రికార్డు స్థాయిలో వేరబుల్స్ అమ్మకాలు
స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్ వంటి వేరబుల్స్ వినియోగం భారత్‌లో అనూహ్యంగా అధికమవుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా 1.18 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయని ఐడీసీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి. ఇందులో ఇయర్‌వేర్ విభాగంలో 39.7 శాతం వాటా ఉన్న ట్రూ వైర్లెస్ స్టీరియో (ఇయర్‌బడ్స్) 40 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 1,156.3 శాతం పెరుగుదల. ధరలు తగ్గుముఖం పడుతుండడమూ వేరబుల్స్ సేల్స్ దూకుడుకు కారణం అవుతోంది.
