స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన నోకియా..
టెక్నాలజీ ఎంతగా పరుగులు పెడుతుంది అంటే మాటల్లో చెప్పలేనిది.. ఎప్పుడు కొత్త కొత్త వాటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఆ వస్తువులకు ఉన్న డిమాండ్ ను బట్టి ప్రజలు కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ కంపెనీ నోకియా సరికొత్త ఫీచర్స్ ఉన్న స్మార్ట్ టీవీ ను మార్కెట్ లోకి విడుదల చేసింది..ఇందులో 4కే యూహెచ్డీ రిజల్యూషన్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. హెచ్డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇందులో ఉన్న డాల్బీ విజన్ సపోర్ట్ ద్వారా టీవీ వీక్షణ అనుభవం మరింత అద్భుతంగా మారనుంది. దీంతోపాటు నోకియా 32, 43, 50, 55, 65 అంగుళాల టీవీలు కూడా లాంఛ్ చేశారు.. ఇకపోతే ఇప్పుడు 58 అంగుళాల కూడా లాంఛ్ చేసినట్లు తెలుస్తుంది..
వైఫై, బ్లూటూత్ 4.2 వంటి వైర్ లెస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నోకియా 75 అంగుళాల స్మార్ట్ టీవీలో నాలుగు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ 2.0 పోర్టులు, ఆప్టికల్ ఆడియో, వీజీఏ, ఎథర్ నెట్ పోర్టులను అందించారు. దీంతోపాటు ఇందులో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను అందించారు. ఈ స్మార్ట్ టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్స్ కూడా ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్స్ సిస్టమ్ కూడా అందించారు. ఈ టీవి బరువు సుమారు 47 కేజీల వరకు ఉంటుందని అంటున్నారు..
