ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త..
నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(UCIL) మరో శుభవార్త చెప్పంది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 30 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రకటింది. ITI, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషినల్ ట్రైనింగ్(NCVT) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని తుమ్మలపల్లోలోని UCIL కేంద్రంలో పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు: 30
ఫిట్టర్: 8
ఎలక్ట్రీషియన్: 8
వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రిక్): 3
Turner or Machinist: 3మెకానిక్: 4
కార్పెంటర్: 2
ప్లంబర్: 2
ఐటీఐ పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్న వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో సూచించిన ఫార్మాట్లో అప్లికేషన్ ను నింపి, ఎస్సెస్సీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇతర విద్యార్హత సర్టిఫికేట్లను Manager [E/P/A], Uranium Corporation of India Limited, Tummalapalle Village, PO : Mabbuchintalapalle, Vemula Mandal, Dist : Kadapa, Andhra Pradesh- 516 349 అడ్రెస్ కు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను స్పీడ్ పోస్టు ద్వారా డిసెంబర్ 16వ తేదీలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకోమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
