రంగంలోకి విజయశాంతి..
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న విజయ శాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పుడు ఇదే వార్త రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి బీజేపీలో చేరనున్నారని ఆమె సన్నహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
మంగళవారం నాడు ఆమె ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆమె బీజేపీ తరపున జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. దుబ్బాక ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి విజయ శాంతితో భేటీ అయిన విషయం తెలిసిందే.
అటు బండి సంజయ్ కూడా విజయ శాంతిపై ప్రశంసలు కురిపించారు.
