సీఎం కేసీఆర్ ప్రకటించిన సహాయక చర్యల పట్ల ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్
సినిమా ఇండస్ట్రీ కోలుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన సహాయక చర్యల పట్ల ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా ప్రభావంతో కుంగిపోయిన చిత్ర పరిశ్రమను ప్రభుత్వ నిర్ణయాలు కచ్చితంగా పునరుజ్జీవింప చేస్తాయని నమ్ముతున్నామని తెలిపారు. సినీ రంగంపై సీఎం కేసీఆర్ కురిపించిన వరాల జల్లుతో ఇండస్ట్రీ మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. నాగార్జున స్పందిస్తూ, సీఎం కేసీఆర్ కు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. తీవ్ర సంక్షోభ సమయంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరు పట్ల ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు.
