కొత్త అధ్యక్షుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు
అమెరికా అధ్యక్షుడంటే మాటలు కాదు. యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణంలో మార్పులు... ఇలా ఏ సంక్షోభం వచ్చినా, దానిపై దేశాల స్పందనను అమెరికా అధ్యక్ష పీఠం ప్రభావితం చేస్తుంది.
ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియపై చాలా కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. బీబీసీ ప్రతినిధులుగా మేం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎలక్ట్రోరల్ కాలేజీ ఎలా పని చేస్తుంది, ఏ రాష్ట్రం కీలకంగా మారనున్నాయనే విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మీరు మొదటిసారి తెలుసుకోవాలనుకున్నా, ఉన్న అవగాహనను మరింత పెంచుకోవాలని అనుకున్నా ఈ సింపుల్ గైడ్ మీకు సహాయపడుతుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతిసారి నవంబర్ మొదటి సోమవారం తర్వాతి మొదటి మంగళవారం జరుగుతాయి. ఈసారి నవంబరు 3న ఎన్నికలు నిర్వహించారు.
చాలా ఇతర దేశాల ఎన్నికలతో పోలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే జరుగుతాయి. ఈ రెండు పార్టీల్లోని ఏదో ఒకదాని నుంచి అధ్యక్షుడు ఎన్నికవుతారు.
రిపబ్లికన్ పార్టీకి అమెరికాలో సంప్రదాయవాద పార్టీగా పేరుంది. ఈసారి ఆ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడ్డారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ బరిలో నిలిచారు. విజయం ఆయన్నే వరించింది.
విజేతను నిర్ణయించేది ఎవరు ?
దేశవ్యాప్తంగా అత్యధికంగా ఓట్లు సాధించినంత మాత్రాన వారు అమెరికాకు అధ్యక్షులైపోరు. 2016లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ విషయంలో ఇదే జరిగింది.
ఎలక్ట్రోరల్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు విజేతలవుతారు. ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి. ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. అమెరికాలో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా, 270కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేత అవుతారు.
రెండు రాష్ట్రాలు మినహా, మిగిలిన రాష్ట్రాలు విన్నర్స్ టేక్స్ ఆల్ అనే నిబంధన కింద ఓటింగ్‌లో పాల్గొంటాయి. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు గెలిచిన అభ్యర్ధికి రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లను కేటాయిస్తారు.
చాలా రాష్ట్రాలు ఒకపార్టీవైపు ఏకపక్షంగా మొగ్గు చూపుతాయి. అంటే పార్టీలు ఒక డజన్ ఆపై రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించి, ఎక్కువ ఓట్లను పొందగలిగితే వారు విజేతలవుతారు. అలాంటి రాష్ట్రాలనే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1992 తర్వాత డెమొక్రాట్లకు దక్కని జార్జియాలో గెలవడం ద్వారా జో బైడెన్ చరిత్ర సృష్టించారు. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి 272 ఎలక్టొరల్ ఓట్ల అవసరం. అయితే, జో బైడెన్ 306 ఎలక్టొరల్ ఓట్లను సంపాదించారు.
ఎవరు ఓటు వేస్తారు, ఎలా వేస్తారు ?
18 సంవత్సరాలు నిండి, అమెరికా పౌరుడైతే అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి అర్హత సాధిస్తారు.అయితే అనేక రాష్ట్రాలు తాము ఎవరో నిరూపించుకునే గుర్తింపు కార్డులను చూపాలంటూ ఓటర్లకు నిబంధనలు విధించాయి.
సాధారణంగా రిపబ్లికన్ పార్టీ ఇలాంటి నిబంధనలను డిమాండ్ చేస్తుంది. ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరక్కుండా ఈ ఏర్పాటు ఉండాలన్నది ఆ పార్ వాదన. అయితే డెమొక్రాటిక్ పార్టీ మాత్రం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తుంది. ఇది ఓటర్ల హక్కులను అణచి వేయడమేనని, ఐడీ కార్డు చూపలేని మైనారిటీలు, పేదలు ఓటింగ్‌కు దూరమవుతారన్నది ఆ పార్టీ మాట.
