ఆ పరీక్షలకు తేదీలు ఖరారు చేసిన సీబీఎస్ఈ.. రూల్స్ ఇవే..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష తేదీలను శనివారం విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఈ పరీక్షలను జరపనున్నట్టు తెలిపింది. అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించిన కచ్చితమైన తేదీలను త్వరాత వెల్లడిస్తామని పేర్కొంది. అలాగే ఈ పరీక్షలు నిర్వహించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను(SOP)జారీచేసింది. పరీక్షలకు సంబంధించి వేర్వేరు తేదీలను పాఠశాలలకు పంపనున్నట్టు బోర్డు తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షలను బోర్డు తరఫున నియమించబడిన అబ్జర్వర్స్ పర్యవేక్షించనున్నారని చెప్పింది. గతేడాదిలాగే ఈ సారి కూడా ప్రాక్టికల్ పరీక్షల్లో ఇంటర్నల్, ఎక్స్‌ట్రనల్ రెండు ఉంటాయని వెల్లడించింది.
ఫొటోలో ప్రతి ఒక్కరి ముఖం తప్పకుండా కనిపించే విధంగా చూడాలని ఆదేశించింది.ఇక, సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తామని బోర్డు సెక్రటరీ అనురాగ్ త్రిపాఠి శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. పరీక్షలు గతేడాది ఫార్మాట్ లోనే ఉంటాయా? లేదా? అన్న అంశంపై సైతం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలోనే ఉంటాయా లేక ఆలస్యంగా నిర్వహిస్తారా అన్న అంశంపై ఇంకా సీబీఎస్ఈ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
