మళ్లీ లాక్డౌన్ : ఇంగ్లాండ్
ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. యునైటెడ్ కింగ్డమ్లో రెండోసారి ఆందోళకర స్థాయిలో విస్తరిస్తున్నది. తొలిసారి కంటే రెండోసారి మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి మరో మార్గం లేక రెండోసారి లాక్డౌన్ విధించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. గురువారం నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త లాక్డౌన్ నాలుగు వారాల పాటు కొనసాగనున్నది. ''ఇంకో ప్రత్యామ్నాయం లేదు. కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. అందరూ ఇంటికి పరిమితం కావాల్సిందే. చదువు, ఇంటి నుంచి పని వీలుకాకపోతే ఆఫీసు, స్వల్ప వ్యాయామం, చికిత్స, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల కోసం తప్ప బయటకు రావొద్దు.
