ఇండస్ టవర్స్‌లో ఇన్ఫ్రాటెల్ విలీన ఎఫెక్ట్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్‌చేసి 44,537ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నిఫ్టీ 135 పాయింట్లు ఎగసి 13,061 వద్ద ట్రేడవుతోంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మార్క్‌ను నిఫ్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి.
