అదిరిపోయే ఫీచర్లతో మోటో
ప్రస్తుతం భారత దేశంలో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. రోజుకో విధంగా కొత్త రకం ఎలెక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి దర్శనం ఇస్తున్నాయి.. పండగల సీజన్ కావడంతో కంపెనీలు కూడా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.. అయితే ఇప్పుడు ప్రముఖ మోటో కంపెనీ మరో కొత్త ఫోన్లు ను లాంఛ్ చేయనుంది..ఆ ఫోన్ ను అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ ఫోన్ కు సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ధర తక్కువ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.. మార్కెట్ లోకి విడుదల అయితే మాత్రం ఈ ఫోన్ సేల్స్ భారీగా అవుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఫోన్ ప్రత్యేకతలు మీరు కూడా చూసేయండి..
ఇకపోతే మోటో జీ స్టైలస్ 2021 కూడా ఆన్ లైన్లో కనిపించింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్లో లీకయ్యాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 4 జిబి జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది..వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.. లాక్ కోసం ఫింగర్ ప్రింట్ సౌకర్యం కూడా కలదు..
