ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256
ప్రీమియం మోటర్‌సైకిళ్ల బ్రాండ్ కేటీఎం శుక్రవారం కొత్త మోడల్ ''కేటీఎం 250 అడ్వెంజర్''ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256 గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని షోరూంల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో అమర్చిన 248 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 30 హార్స్పవర్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ స్లిప్పర్ క్లచ్ సాయంతో సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్(6-గేర్లు) వ్యవస్థతో పనిచేస్తుంది.
దేశీయ మార్కెట్లో ఈ బైక్‌కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌పల్స్ మోడళ్లు ఉన్నాయి.
