గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో మిలిటరీ బేస్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ బేస్‌ను సందర్శించారు. దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్ పెత్తనంపై దిగ్గజ దేశాలు భగ్గుమంటున్న వేళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్‌్ప్స(నావికా దళం)ను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, విశ్వసనీయత కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
