డిఫెన్స్‌లో 345 ఉద్యోగాలు...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ప్రతీ ఏటా రెండు సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి సంబంధించి మొదటి నోటిఫికేషన్ విడుదలైంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS 1 ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది యూపీఎస్సీ. మొత్తం 345 పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది యూపీఎస్సీ. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అకాడమీల్లో ఈ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. UPSC CDS 1 2021 నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
