ఐపిఎల్ మ్యాచ్లకు దూరమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు
SATYASHILA TV : మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పాలక మండలి నిర్ణయం ప్రకారం ఈ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఐపిఎల్ ప్రారంభ వారంలో ఐపీఎల్లో పాల్గొనలేరు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగుతోండగా.. ఈ సిరీస్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 16వ తేదీన జరుగుతుంది. సిరీస్ ముగిసిన ఒక రోజు లేదా రెండు రోజుల తరువాత, ఈ రెండు దేశాల నుంచి ఆటగాళ్ళు యూఏఈకి వెళ్తారు. అప్పుడు 6 రోజులు క్వారంటైన్లో ఉండవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, సెప్టెంబర్ 24 వరకు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మైదానంలోకి వచ్చే అవకాశం లేదు.
