దిగొచ్చిన క్రీడా శాఖ : పంతం నెగ్గిన సైనా
SATYASHILA TV :
తన భర్త పారుపల్లి కశ్య్‌పకు జాతీయ క్యాంప్‌లో పాల్గొనే అవకాశం కల్పించడంతో సైనా బెట్టు వీడింది. గోపీచంద్ అకాడమీలో జరిగే జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్ కోసం సోమవారం నుంచి ఈ నెల 27 వరకు జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. మూడు వారాలపాటు సాగే క్యాంప్‌లో సైనా, కశ్య్పతోపాటు సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ స్పెషలి్‌స్టలు అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా పాల్గొననున్నారు. వ్యక్తిగత కారణాలతో ఉబెర్ కప్ నుంచి తప్పుకొంటున్నట్టు పీవీ సింధు ప్రకటించడంతో ఈ జాబితాలో ఆమె పేరును చేర్చలేదు. కాగా, ఒలింపిక్ ప్రాబబుల్స్ కోసం గత నెలలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో కశ్య్‌పకు చోటు కల్పించక పోవడంపై సైనా కినుక వహించింది. దీంతో మరోచోట ప్రాక్టీస్ చేసింది.
