నాగోల్ - రాయదుర్గం మధ్య మెట్రో సేవలు ప్రారంభం
SATYASHILA TV
: నాగోల్ - రాయదుర్గం మధ్య మెట్రో సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లు మూసివేయనున్నారు. గాంధీ హాస్పిటల్, భరత్‌నగర్, మూసాపేట, యూసఫ్‌గూడ మెట్రోస్టేషన్ల మూసి ఉండనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా, స్టేషన్లు, రైళ్లలో మార్కింగ్ ఏర్పాటు చేశారు. నిత్యం స్టేషన్ పరిసరాలు, రైళ్లను సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. కేవలం నగదు రహిత రూపంలో ప్రయాణం చేసేందుకు అధికారులు ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్, స్మార్ట్‌కార్డ్, క్యూఆర్ కోడ్‌తో టికెట్లతో మాత్రమే జారీ చేస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రయాణికులు ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశారు. లేకుంటే అధికారులు జరిమానా విధిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే స్టేషన్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.
