ఉబెర్ కప్ టోర్నీ కి వెళ్లేందుకు అంగీకరించిన పీవీ సింధు
SATYASHILA TV :
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వచ్చేనెలలో డెన్మార్క్‌లో ప్రారంభంకానున్న థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ లో పాల్గొనడానికి అంగీకరించింది. వచ్చేనెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ జరగనుంది. అయితే ముందుగా వ్యక్తిగత కారణాల వల్ల ఈ టోర్నీలో దూరమవుతున్నట్లు సింధు తెలిపింది. అయితే తాను ఒలింపిక్స్ కోసం అత్యుత్తమ శిక్షణ పొందడం కోసమే ఉబెర్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది అని.. లేదు ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగానే వైదొలిగింది అని వార్తలు వచ్చాయి. కానీ తన తన కుటుంబానికి చెందిన వేడుకలో పాల్గొనడానికే ఇందునుండి తప్పుకున్నట్లు తెలిసింది. కానీ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చీఫ్ హిమంత బిశ్వ శర్మ సింధును ఈ టోర్నీ లో ఆడేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది. తాను ఇందులో పాల్గొంటే భారత్ కు మెడల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని శర్మ సింధుకు చెప్పాడట. దాంతో తన కుటుంబ వేడుకను ముందుగా నిర్వహించుకొని థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ లో ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింధు. ఈ విషయాన్ని బాయ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
