రాష్ట్రీయ మిలటరీ కాలేజీ(ఆర్ఐఎంఎస్)లో 8వ తరగతిలో ప్రవేశాలకు డిసెంబర్ 1, 2న పరీక్ష
`
హైదరాబాద్: డెహ్రడూన్‌లోని రాష్ర్టీయ మిలటరీ కాలేజీ(ఆర్ఐఎంఎస్)లో 8వ తరగతిలో ప్రవేశాలకు డిసెంబర్ 1, 2న పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులకు హైదరాబాద్‌లో పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు రెండు ఫొటోలు, పుట్టిన తేది, కుల ధ్రువపత్రాల ఫొటో కాపీలను ఈనెల 30లోగా తమ కార్యాలయానికి పంపించాలని సూచించింది.
