గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరో మరో 29 యాప్స్ తొలగింపు
యాడ్వేర్(యూజర్ ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్)తో నిండిన 29 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ యాప్స్ అండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో 3.5 మిలియన్లకు పైగా డౌన్లోడ్ అయి ఉన్నాయి. సతోరి ఇంటెలిజెన్స్ బృందం చార్ట్రూస్బ్లూర్ పేరుతో జరిపిన పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్‌లను కనుగొన్నారు. వీటిలో అధికంగా ఫోటో ఎడిటింగ్ యాప్‌లు ఉన్నట్లు తేలింది. దర్యాప్తులో యాప్స్‌లో బ్లర్ అనే పదం చాలా హానికరమైనదగా తేలింది. ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌లో వినియోగంలోని లేని యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఏ యాప్ అయినా యూజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మొబైల్లో లాంచ్ ఐకాన్స్ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దీని ద్వారా యూజర్ ఈ యాప్‌లను డిలీట్ చేయడానికి కష్టంగా మారుతుంది. యాడ్వేర్ ఉన్న ఓ యాప్ స్క్వేర్ ఫోటో బ్లర్ యాప్. సాటోరి బృందం ఈ యాప్‌ను పరీక్షించింది. ఈ యాప్ సరిగా వర్క్ చేయడం లేదు. ఫోన్లలో ఓసీసీ యాడ్లను అమలు చేస్తోంది. ఈ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసేన తర్వాత లాంచ్ ఐకాన్ అదృశ్యమైంది. అంతేగాక ప్లే స్టోర్‌లో “ఓపెన్” ఫంక్షన్ కూడా లేదు.
